రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం! | Sakshi
Sakshi News home page

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!

Published Tue, May 21 2024 6:08 PM

IMD: Possibility of low pressure in Bay of Bengal on May 22

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో రేపు(బుధవారం) అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 గంటల్లో (మే24) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల చివర వరకు తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని  వెల్లడించింది.

ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి అనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. దీంతో అయిదు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకూ ఆవరించింది. ఈ కారణంగా తెలంగాణలో పలు జిల్లాల్లో  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీతెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement