
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్‌తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.
తమ్ముడి చేతిలో అన్న హతం
మరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.