హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న భారీ రియాక్టర్‌ | A huge reactor reached HPCL | Sakshi
Sakshi News home page

హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న భారీ రియాక్టర్‌

May 19 2021 4:25 AM | Updated on May 19 2021 4:25 AM

A huge reactor reached HPCL - Sakshi

హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న రియాక్టర్‌

మల్కాపురం (విశాఖ పశ్చిమ): విశాఖ షిప్‌యార్డ్‌ నుంచి భారీ రియాక్టర్‌ను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెచ్‌పీసీఎల్‌కు తరలించారు. గత రెండేళ్ల నుంచి హెచ్‌పీసీఎల్‌ సంస్థ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన భారీ రియాక్టర్‌లను గుజరాత్‌లోని ఎల్‌అండ్‌టీ సంస్థ తయారుచేస్తోంది. గుజరాత్‌ నుంచి రియాక్టర్‌లు సముద్రమార్గం ద్వారా షిప్‌యార్డ్‌కు వస్తున్నాయి.

అక్కడ నుంచి భారీ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు తరలిస్తున్నారు. ఇదేవిధంగా మంగళవారం షిప్‌యార్డ్‌కు వచ్చిన భారీ రియాక్టర్‌ను అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన భారీ హైడ్రాలిక్‌ వాహనం సాయంతో హెచ్‌పీసీఎల్‌కు చేరవేశారు. ట్రాఫిక్‌ సమస్యలు ఉండవని తెల్లవారుజామునే అధికారులు రియాక్టర్‌ను తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement