ఇళ్ల విస్తీర్ణంలోనూ రికార్డే

House Structure beyond NBC regulations Andhra Pradesh - Sakshi

ఎన్‌బీసీ నిబంధనలకు మిన్నగా నిర్మాణం

బెడ్‌రూమ్, హాలు, కిచెన్, బాత్‌రూమ్, వరండా

సాక్షి, అమరావతి : ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు విస్తీర్ణంలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా, ఇదివరకెన్నడూ ఇంత విస్తీర్ణంలో పేదల ఇళ్లు నిర్మించలేదని స్పష్టం అవుతోంది. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే.. వారు సూచించిన విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

నగరాలు, పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో ఇళ్ల నిర్మాణం సాగుతోంది. బెడ్‌రూమ్, హాలు, వంట గది, బాత్‌ రూమ్, వరండాతో ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే రూ.10 వేల కోట్లు వ్యయం చేసింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top