వందేళ్లు దాటినా చెక్కు చెదరని భవనాలు  

Historical Heritage Buildings In Sri Sathya Sai District - Sakshi

పెనుకొండ: ఆంగ్లేయుల కాలంలో పెనుకొండలో నిర్మించిన కట్టడాలు వందేళ్లు దాటినా నేటికీ చెక్కు చెదరలేదు. గాలి, వెలుతురు, ఆహ్లాదకర వాతావరణం కలిగిన ఈ భవనాలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల భవనాలుగా సేవలందిస్తున్నాయి. కింది భాగం నుంచి రాయి, పై కప్పు భాగంలో పెంకులు, విశాలమైన కిటికీలు, తలుపులతో కూడిన భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి.

పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల  

ప్రస్తుత సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, కోర్టు భవనం, ఆర్‌డబ్ల్యూఎస్, సబ్‌ట్రెజరీ, తహసీల్దార్‌ కార్యాలయం, సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయం, సబ్‌కలెక్టర్‌ బంగ్లా, ఎక్సైజ్‌ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాల, సబ్‌జైల్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆర్‌అండ్‌బీ భవనాలు తదితర కట్టడాలన్నీ ఆంగ్లేయుల హయాంలో నిర్మించినవే.

పశు సంవర్ధక కార్యాలయం  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top