world heritage day
-
“చరిత్రలోకి అడుగేసి మన నగర గత వైభవాన్ని గుర్తిద్దాం”
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహించే ప్రపంచ వారసత్వ దినోత్సవం (International Day for Monuments and Sites) సందర్భంగా, ఈరోజు ఉదయం 7:30 గంటలకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ (ASI) – హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC), JBRAC, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించబడింది.Er. వేదకుమార్ మనికొండ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ప్రారంభించి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ప్రొఫెసర్ Ar. జి.ఎస్.వి. సూర్యనారాయణ మూర్తి(South Zone Representative, ICOMOS, India), డా. జి. జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర మరియు పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ASI, డా. ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ASI, శ్రీమతి జె. రాజేశ్వరి (Conservationist, ASI), సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు(తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) , ఎస్. ప్రభాకర్(DTO, పర్యాటక శాఖ), డి. శ్రీనివాస్ (హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్), డి. శ్యాం సుందర్ రావు, స్థపతి, డా. ద్యావనపల్లి సత్యనారాయణ(క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం), పి. వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్ మరియు సిటీ కాలేజ్, JBRAC, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, SRDP, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Er.వేదకుమార్ మనికొండ గారు చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఉన్న ముఖ్యమైన వారసత్వ కట్టడాల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజపు కలసికట్టు బాధ్యతగా భావించాలని సూచించారు. హైదరాబాద్ యొక్క చారిత్రక ఘనతను ప్రజలకు తెలియపరుస్తూ, వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.ఇంకా, తెలంగాణ వారసత్వ శాఖ మరియు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక జాబితాలో చేర్చించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. త్వరలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడుతూ, ఇటువంటి వాక్‌ల ప్రాముఖ్యతను వివరించారు. చార్మినార్ యొక్క చారిత్రక, శిల్పకళా విశేషాలను విద్యార్థులకు వివరించారు.చార్మినార్ మీదుగా లాడ్ బజార్, మోతిగల్లి,మెహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్), ఇక్బాల్ ఉద్ దౌలా దేవ్డీ, మక్కా మసీదు ద్వితీయ ద్వారం, జిలుఖానా,ఖుర్షీద్ జా బహదూర్ ప్యాలెస్,ఇక్బాల్ ఉద్ దౌలా ప్యాలెస్, ఖిలావత్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద ఈ వాక్ ముగిసింది.ఈ వాక్ ద్వారా పాల్గొన్నవారికి హైదరాబాద్ నగరపు ప్రాచీన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. రాజప్రాసాదాలు, శతాబ్దాల నాటి మసీదులు, స్థానిక శిల్పకళ ఆధారిత నిర్మాణాలు వారి చూపుల ముందే ఆవిష్కృతమయ్యాయి. నగరపు బహుముఖ సంస్కృతి మరియు వారసత్వంపై గర్వభావం వారిలో మళ్ళీ వెల్లివిరిసింది. -
World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్‌మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్‌లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్‌పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!) -
వారసత్వ రక్షణ బాధ్యత ప్రజలపైనే
కడప కల్చరల్: ముందుతరం పెద్దలు అయాచితంగా మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపదను అందించారు. వాటిని పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యేటా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించకుంటూ వారసత్వ సంపద పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది. వారసత్వ సంపద పరిస్థితి గురించి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఘనమైన వారసత్వ సంపదలో మనజిల్లాలోని గండికోట కూడా ముందు వరుసలో నిలుస్తుంది. జిల్లాలోని సిద్దవటం కోట కూడా నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. సిద్దవటం కోటలో బురుజులు, గోడ కూలుతున్నాయి. వాటికి కూడా తక్షణ మరమ్మతులు అవసరం. ప్రజలకు ఈ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత గురించి వివరించాల్సిన బాధ్యత గల వారు పర్యాటకులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో క్రమంగా సందర్శకుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గుతోంది. -
వందేళ్లు దాటినా చెక్కు చెదరని భవనాలు
పెనుకొండ: ఆంగ్లేయుల కాలంలో పెనుకొండలో నిర్మించిన కట్టడాలు వందేళ్లు దాటినా నేటికీ చెక్కు చెదరలేదు. గాలి, వెలుతురు, ఆహ్లాదకర వాతావరణం కలిగిన ఈ భవనాలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల భవనాలుగా సేవలందిస్తున్నాయి. కింది భాగం నుంచి రాయి, పై కప్పు భాగంలో పెంకులు, విశాలమైన కిటికీలు, తలుపులతో కూడిన భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుత సబ్ కలెక్టర్ కార్యాలయం, కోర్టు భవనం, ఆర్డబ్ల్యూఎస్, సబ్‌ట్రెజరీ, తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజి్రస్టార్ కార్యాలయం, సబ్‌కలెక్టర్ బంగ్లా, ఎక్సైజ్ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాల, సబ్‌జైల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్అండ్బీ భవనాలు తదితర కట్టడాలన్నీ ఆంగ్లేయుల హయాంలో నిర్మించినవే. పశు సంవర్ధక కార్యాలయం -
హైదరాబాద్‌లో హష్మత్‌గంజ్ గేటు.. పట్టించుకోపోతే అంతే!
సాక్షి, హైదరాబాద్: ఇదో గేటు.. ఓ రాజప్రాసాదం ప్రవేశ ద్వారం. దీని వయసు దాదాపు 217 ఏళ్లు. బ్రిటిష్ పాలకులు నిర్మించారు. అందుకే దీని శిఖర భాగంలో ఇప్పటికీ రెండు సింహాలతో కూడిన నాటి ఈస్టిండియా కంపెనీ చిహ్నం కనిపిస్తుంది. కానీ ఈ గేటు ఇప్పుడు తప్పిపోయింది. భవనమెక్కడో.. ఈ ద్వారమెక్కడో అన్నట్టు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. ఇలా ఒంటరిగా ఇరుకు సందుల్లో ఇరికిపోయింది. వందల ఏళ్లనాటి డంగుసున్నపు నిర్మాణం కావటంతో పట్టించుకునేవారు లేకున్నా పటిష్టంగా నిలిచి ఉంది. కానీ మరమ్మతులు చేయకపోతే మాత్రం ఇక నిలవలేనంటోంది. దీన్ని హష్మత్‌గంజ్ గేటు అని పిలుస్తారు. ఎందుకు తప్పిపోయింది.. ఏంటా కథ హైదరాబాద్‌కు ఐదో రెసిడెంట్‌గా వ్యవహరించిన కిర్క్ పాట్రిక్ 1805లో బ్రిటిష్ రెసిడెంట్ కోసం రాజప్రాసాదం నిర్మించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ శైలితో అచ్చుగుద్దినట్టు అదే డిజైన్‌తో, అదే సమయంలో ఈ రెసిడెన్సీ నిర్మితమైంది. ప్రస్తుతం దీన్ని కోఠి మహిళా కళాశాలగా పిలుస్తున్నారు. ఈ రెసిడెన్సీకి వివిధ మార్గాల్లో ద్వారాలు నిర్మించారు. ప్రస్తుతం సుల్తాన్‌బజార్–బడీచౌడి మార్గంలో ఉన్న హష్మత్‌గంజ్ గేటు కూడా వీటిల్లో ఓ ద్వారం. అప్పట్లో రెసిడెన్సీ చుట్టూ చిన్న ప్రహరీ తప్ప పెద్ద కోటగోడ లేదు. 1857తో తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి జరగడంతో చుట్టూ భారీ గోడ నిర్మించారు. ప్రస్తుత ఆంధ్రాబ్యాంకు ప్రధాన రహదారిని 1950 ప్రాంతాల్లో నిర్మించారు. ఆ సమయంలో మధ్యలో దారి రావడంతో భవనానికి, ఈ ద్వారానికి మధ్య అనుంబంధం తెగిపోయింది. ఆ తర్వాత భవనంలో మహిళా కళాశాల ఏర్పాటు చేశారు. దీని బాగోగులను ఉస్మానియా విశ్వవిద్యాలయం, పురావస్తు శాఖలు చేపడుతూ రాగా క్రమంగా ఈ గేటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలోకి వెళ్లిపోయింది. ఇక ఆలనాపాలనా నిలిచిపోయింది. భారీగా నిధులొచ్చినా.. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ నుంచి రూ. కోట్ల నిధు లు రావటంతో రెసిడెన్సీ భవనంలోని ప్రధాన దర్బార్ హాలుతో పాటు మరికొన్ని భాగాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పునర్ వైభవం కల్పించా రు. కానీ ఆ భవనంలో భాగంగా నిర్మితమైన ఈ ద్వారానికి నయా పైసా కేటాయించలేదు. బడీచౌడి రోడ్డులోని చిరు వ్యాపారులు ఈ ద్వారం గోడలకు మేకులు దింపి వస్తువులు తగిలించుకోవడానికి వాడుతున్నారు. పట్టించుకునేవారు లేక ఈ కట్టడం క్రమంగా శిథిలమవుతోంది. పట్టించుకుంటే.. పర్యాటక ప్రదేశమవుతుంది ఈ ద్వారం ఎంతో ప్రత్యేకమైంది. దీని చుట్టూ నిర్మాణాలు తొలగించి గేటును విడిగా చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. లైటింగ్ బిగించి కట్టడం వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తే అద్భుత పర్యాటక ప్రదేశమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి – తురగ వసంత శోభ, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ -
సర్వతోభద్ర ఆలయం పునరుద్ధరణకు కృషి
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి జయశంకర్ జిల్లా నైన్‌పాకలోని సర్వతోభద్ర ఆలయ పునరుద్ధరణను తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. చిట్యాల మండలంలోని నైన్పాక ఆలయం విశిష్టతపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ‘దేవుడు ఎదురు చూడాల్సిందే..!’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆలయ విశిష్టతలను తొలిసారిగా సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆలయ ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నైన్‌పాకలో నిర్వహించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ (ఇంటాక్) ఆధ్వర్యాన గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. కాకతీయుల కాలంలో కర్ణాటక నుంచి ఒరిస్సాదాకా కాకతీయుల సామ్రాజ్యం విస్తరించి ఉందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 350కి పైగా కాకతీయుల కట్టడాలు ఉన్నాయని, నైన్పాక దేవాలయానికి కూడా వారసత్వ సంపదలో స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. -
వెలుగు.. కనుమరుగు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : ఒకప్పటి చరిత్రకు.. నాటి జీవితం తీరుతెన్నులకు సాక్ష్యాధారాలు ఇప్పటికీ అక్కడక్కడా మిగిలిన గత వైభవ చిహ్నాలు. అప్పటి పాలనకు, జీవనానికి ఇవి కొండగురుతులు. ఇటువంటి నిర్మాణాలు విశాఖ వైభవానికి ప్రతీకలు. పాలనకు కేంద్రమై కళకళలాడే కలెక్టరేట్ నుంచి రోగులకు స్వస్థత చేకూర్చే కేజీహెచ్ వరకు.. ప్రేమ చిహ్నంగా వెలుగులీనే విశాఖ తాజ్ మహల్ నుంచి చదువుల చెట్టుగా వన్నెకెక్కిన సెయింట్ అలాషి యస్ స్కూల్ వరకు.. ఒకటా రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో విశిష్ట నిర్మాణాలు. అన్నీ గతవైభవ ఘనకీర్తులకు నిదర్శనాలు. అయితే వీటిలో చాలామట్టుక పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరిగిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. కాల గమనంలో కనుమరుగవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన వారి బాధ్యతారాహిత్యం కారణంగా నిశ్శబ్దంగా అదృశ్యమైపోతున్నాయి. బుధవారం ప్రపంచ చారిత్రక కట్టడాల పరిరక్షణ దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో తమను కాపాడేవారెవరని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. నాటి నిర్మాణాలు బ్రిటిష్ హయాంలో విశాఖలో ఎన్నో కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో అధిక భాగం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతంలో పలు చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. కలెక్టరేట్, క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల పాఠశాల, విక్టోరియా మహారాణి విగ్రహం, కురుపాం మార్కెట్, సెయింట్ ఎలాసియస్ మిషనరీ పాఠశాల, డచ్ సమాధులు, జగదాంబ జంక్షన్లో గల రెజిమెంటల్ లైన్స్ సమాధులు, పాత పోస్టాఫీసు దరి చర్చి, బురుజుపేటలోని చర్చి వుడా రూపొందించిన జాబితాలో చోటుచేసుకున్నాయి. అలాగే, పెదవాల్తేరులో గల రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి, ఇప్పటి విశ్వప్రియ ఫంక్షన్ హాల్, కిర్లంపూడి లేఅవుట్లో గల విశాఖమ్యూజియం, కేజీహెచ్ వంటివెన్నో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ ఉంటాయి. బీచ్ ఒడ్డున ప్రేమచిహ్నంగా నిలిచిన వైజాగ్ తాజ్ మహల్.. పాతపోస్టాఫీసు దగ్గరి విక్టోరియా మహారాణి విగ్రహం వంటివి మాత్రమే కాక టౌన్‌హాల్, హవామహల్, టర్నర్ చౌల్ట్రీ వంటి నిర్మాణాలు చరిత్ర ప్రసిద్ధమైనవి. వీటిలో చాలామట్టుకు శిథిలమవుతున్నాయి. హెరిటేజ్ డేలను మొక్కుబడిగా నిర్వరిస్తూ వీటి సంరక్షణను కాస్తయినా పట్టించుకోని పాలకుల నిర్వాకం కారణంగా ఇవి క్రమంగా అదృశ్యమైపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈసారైనా పాలకుల దృష్టి వీటిపై పడుతుందంటే సందేహమే. -
నేడు హెరిటేజ్ వాక్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి బి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, ఇంటాక్ జిల్లా చాప్టర్ సంయుక్తంగా సాంస్కృతిక వారసత్వం, సుస్థిర పర్యాటకం కింద హెరిటేజ్ వాక్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్కియాలజీ మ్యూజియం, తెలుగు బాపిస్ట్ చర్చి, కోల్స్ కాలేజ్, కొండారెడ్డిబురుజు మీదుగా గోల్ గమ్మజ్ వరకు సాగే హెరిటేజ్ వాక్‌లో పాఠశాలలు, కళాశాలలు, చరిత్ర అధ్యాపకులు, యువత పాల్గొనాలన్నారు. -
చార్మినార్‌లో హెరిటేజ్ డే సందడి
యాకుత్‌పురా: వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తాహేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చార్మినార్‌తో పాటు నగరంలోని చారిత్రాత్మక కట్టడాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలికి చెందిన అవైస్ పాఠశాల విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. చారిత్రక కట్టడాల ఫోటోలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు బాబ్జీరావు, అనిల్ కుమార్, సిహెచ్. పెద్దింటి, జిలానీ పాషా, గోపాల్ రావు, సిహెచ్. అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని చార్మినార్‌ను తిలకించేందుకు సందర్శకులకు సోమవారం ఉచిత ప్రవేశం కల్పించారు. అయితే దీనిపై ముందస్తు ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్పందన లభించలేదు. -
హెరిటేజ్ సైట్‌గా రామప్ప
చివరి క్షణంలో స్థానం కోల్పోరుున ఖిలా వరంగల్ యునెస్కో పరిశీలనలో ప్రతిపాదనలు త్వరలో ఫ్రాన్స్ నుంచి {పతినిధుల రాక నేడు వరల్డ్ హెరిటేజ్ డే హన్మకొండ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రామప్ప ఆలయ శిల్ప సంపద కీర్తి పతాకం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు హోదాకు బరిలో ఉన్న రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు త్వరలోనే వరంగల్ రానున్నా రు. యునెస్కో- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటిటేవ్ లిస్ట్ లో ఇప్పటికే రామప్ప ఆలయానికి చోటు లభించిం ది. సోమవారం వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని ప్ర పంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయూనికి గుర్తిం పు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. మూడింటిలో ఒకటి.. కాకతీయుల కళావైభవానికి ప్రతీకలుగా నిలిచిన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలకు ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్) గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ టెంటిటేటివ్ లిస్టులో 2014లో ఈ మూడు కట్టడాలకు చోటు దక్కింది. తర్వాత ప్రక్రియలో భాగంగా ఈ కట్టడాల నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతలను వివరిస్తూ రూ. 20 లక్షల వ్యయంతో 2015 డిసెంబర్లో నివేదిక (డోసియర్) రూపొందించారు. దీనిపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. అరుుతే చారిత్రక కట్టడాల పరిరక్షణ విషయంలో యునెస్కో నిబంధనలు కఠినంగా ఉండటంతో జనావాసాల మధ్య ఉన్న వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్‌ను చివరి నిమిషంలో తప్పించారు. దీంతో రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి చారిత్రక విశేషాలు, శిల్పాల విశిష్టతతో కూడిన తుది నివేదికను ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. త్వరలో ప్రతినిధుల రాక.. రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు విజ్ఞప్తి చేసింది. నివేదిక అందిన తర్వాత ఆరు నెలల లోపు యునెస్కో ప్రతినిధులు వచ్చి రామప్ప ఆలయ విశిష్టత, దాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాల్సి ఉంది. జనవరిలో నివేదిక సమర్పించిన నేపథ్యంలో యునెస్కో ప్రతినిధులు త్వరలోనే జిల్లాకు వచ్చి చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు. అనంతరం యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా రామప్ప ఆలయ ప్రత్యేకతలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వీటిపై యునెస్కో సంతృప్తి చెందితే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తుంది. గుర్తింపు లభిస్తే అద్భుత ప్రచారం.. యునెస్కో నుంచి గుర్తింపు లభిస్తే కాకతీయులు నిర్మిం చిన అద్భుత కట్టడాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభిస్తుంది. ఈ కట్టడాల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికి యునెస్కోతో పాటు కేంద్రం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది. ఇందుకు కర్నాటకలో ఉన్న హంపిని ఉదాహరణగా తీసుకోవచ్చు. యునెస్కో గుర్తింపు తర్వాత హంపి శరవేగంగా అభివృద్ధి చెందింది. టూరిస్టుల సం ఖ్య నాలుగురెట్లు పెరిగింది. హోటళ్లు, టాక్సీలు, ఫుడ్‌కోర్టులు, గైడ్ల సంఖ్య పెరగడంతో యువతకు ఉపాధి అ వకాశాలు మెరుగయ్యాయి. అలాగే రామప్పకు గుర్తింపు లభిస్తే దాంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఐలోని, కొమురవెల్లి, మల్లూరు, మేడారం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవులగుట్ట, గణపురం సున్నపురాయి గుహలు, పెంబర్తి, చేర్యాల హస్తకళలన్నీంటిని కలిపి టూర్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయొచ్చు. శిల్పాల్లోకి నేడు ఉచిత ప్రవేశం ఖిలావరంగల్ : హెరిటేజ్ డేను పురస్కరించుకుని చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణంలోకి సోమవారం పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు కేంద్ర పు రావస్తుశాఖ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. జంగయ్య గడిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగిస్తామని తెలిపారు. పర్యాటకులు, నగర ప్రజలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.