నేడు హెరిటేజ్‌ వాక్‌ | Heritage walk today | Sakshi
Sakshi News home page

నేడు హెరిటేజ్‌ వాక్‌

Apr 17 2017 11:52 PM | Updated on Sep 5 2017 9:00 AM

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి బి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి బి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, ఇంటాక్‌ జిల్లా చాప్టర్‌ సంయుక్తంగా సాంస్కృతిక వారసత్వం, సుస్థిర పర్యాటకం కింద హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్కియాలజీ మ్యూజియం, తెలుగు బాపిస్ట్‌ చర్చి, కోల్స్‌ కాలేజ్‌, కొండారెడ్డిబురుజు మీదుగా గోల్‌ గమ్మజ్‌ వరకు సాగే హెరిటేజ్‌ వాక్‌లో పాఠశాలలు, కళాశాలలు, చరిత్ర అధ్యాపకులు, యువత పాల్గొనాలన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement