రెండేళ్లకే ‘హైరేంజ్‌’

High range book of world records for Shivansh Naga Aditya - Sakshi

వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన శివాన్ష్ నాగ ఆదిత్య(2) ఏ టూ జెడ్‌ వరకు క్రమబద్ధంగా ఆంగ్ల అక్షరాలు ఉచ్ఛరిస్తూ, అనుబంధ ఆంగ్ల పదాలు చెబుతూ హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు.

గ్రామానికి చెందిన కసుమర్తి శ్రీనివాస్, సరిత దంపతుల కుమారుడైన ఆదిత్య చిన్న వయసులోనే ఆంగ్లపదాలు క్రమపద్ధతిలో పలకడం నేర్చుకున్నాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారికి బాలుడి ప్రతిభ తెలియపరుస్తూ వీడియోను 2021 ఫిబ్రవరిలో పంపించారు.

బాలుడి ప్రతిభ గుర్తించి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదు చేస్తూ సర్టిఫికెట్‌ను శుక్రవారం బాలుడి తల్లిదండ్రులకు పంపించారు. బాలుడిని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top