గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

లక్ష్మీపురం: గుంటూరు నుంచి వయా నంద్యాల, కడప మీదుగా తిరుపతికి రోజూ ప్రత్యేక రైలును నడపనున్నట్టు గుంటూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శరత్‌బాబు చెప్పారు. స్టేషన్‌లో గురువారం గుంటూరు–తిరుపతి ప్రత్యేక రైలును ఆయనతోపాటు సీఐ గంగా వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శరత్‌బాబు మట్లాడుతూ రైలు(ఎక్స్‌ప్రెస్) నంబర్ 17261 రోజూ సాయంత్రం 4.30 గంటలకు గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు.
అలాగే రైలు నెంబర్ 17262 రోజూ రాత్రి 7.35 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుకుంటుందని వెల్లడించారు. (క్లిక్: ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..)