పెద్దయ్యాక సీఎం అవుతా..

A Girl child aspiration in Operation Muskan - Sakshi

‘ఆపరేషన్‌లో ముస్కాన్‌’లో ఓ చిన్నారి ఆకాంక్ష 

సాక్షి, తిరుపతి: వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో ఓ బాలిక.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో సీఎంను అవుతానని పోలీసులతో చెప్పింది. తిరుపతి అర్బన్‌ పోలీసులు బుధవారం ఏఆర్‌ పరేడ్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడో తరగతి చదువుతున్న అలకనంద(7) అనే బాలిక తల్లిదండ్రులు 8 నెలల కిందట హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వలస వచ్చి బియ్యం వ్యాపారి వద్ద కూలి పనులు చేసుకుంటూ బాలాజీ లింక్‌ బస్టాండ్‌ వద్ద జీవనం సాగిస్తున్నారు.

తల్లిదండ్రులకు తోడుగా ఈ పాప కూడా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో అర్బన్‌ ఎస్పీ ఆ పాపను విచారిస్తూ పెద్దయ్యాక ఏం చేస్తావ్‌? అని అడిగితే ఆ చిన్నారి పైవిధంగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు చిన్నారి బదిలిస్తూ.. హైదరాబాద్‌లో చదువుకుంటే తమకు అమ్మ ఒడి రాదంది. ఏపీలో తన లాంటి చిన్నారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top