బిల్లు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.. రాష్ట్రమంతా

Free Treatment Under YSR‌ Aarogyasri Across AP If Bill Above 1000 - Sakshi

ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో అమలు..

నేటినుంచి మిగిలిన ఆరు జిల్లాల్లోనూ.. 

అదనంగా 234 వ్యాధులను చేర్చిన ప్రభుత్వం 

నేడు లాంఛనంగా 6 జిల్లాలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

సాక్షి, అమరావతి: ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని సోమవారం రాత్రి తెలిపారు.

ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2,434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.  

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top