
సాక్షి, కంబాలచెరువు: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం సెంట్రల్ జైలుకు తరలించారు. సొంత బావ హత్యకు కారకుడిగా భావిస్తూ ఆయనను అరెస్టు చేసిన పోలీసులు తొలుత కాకినాడ సజ్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయనకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాకినాడ మేయర్ సుంకర పావని, జ్యోతుల నవీన్, కాశీ నవీన్, ఆళ్ల గోవింద్ జైలు వద్దకు ముందుగా చేరుకున్నారు.