ఐదేళ్లలో పేదలే ధనవంతులు | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో పేదలే ధనవంతులు

Published Sun, Jul 23 2023 5:24 AM

In five years poor will be rich - Sakshi

మంగళగిరి: ప్రభుత్వం స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడంతో రానున్న ఐదేళ్లలో పేదలు ధనవంతులు కావడం ఖాయమని, దీంతో టీవీ–5, ఏబీఎన్, ఈనాడు అధినేతలు ఏడవడం, చంద్రబాబు కుళ్లి కుళ్లి చావడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శనివారం గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో పేదలు ఉండకూడదని, సంపన్న వర్గాలు మాత్ర­మే ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పారు.

రాజధాని ప్రాంతం జీవం లేకుండా ఉందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూసినా చంద్రబాబు రైతుల ముసుగులో కోర్టులను ఆశ్రయించి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అయినా రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని సీఎం జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారని, 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఇక్కడ 25 ఊర్లు, 50 వేలకు పైగా నివాసాలు, రెండు లక్షలకు పైగా జనాభా వస్తుందని తెలిపారు.

రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని, ఇది వారి స్వర్గమని, వారి సామాజిక వర్గం మాత్రమే ఉండాలని చంద్రబాబు, ఒక వర్గం మీడియా సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, కోట్ల రూపాయలు న్యాయవాదులకు ఫీజులు కట్టారని, వారి నగ్న స్వరూపాన్ని ఇది బట్టబయలు చేసిందని తెలిపారు. సీఎం జగన్‌ ఎప్పుడూ పేదల పక్షాన పోరాటం చేసి అన్ని సౌకర్యాలతో అమరావతిలో ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. రాజధానిలో రైతులు లేరని, చంద్రబాబు, ఆయన అనుచరులు భూములు కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు.

రాష్ట్ర గృహ­నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈనెల 24న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ పేదల ఇళ్లకు శంకుస్థాపన జరుగుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే రామోజీరావు పడుకోవడం, చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ–5 గుక్కపట్టి ఏడవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్,  సీఎం ప్రోగ్రామ్‌ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, కల్పలతారెడ్డి, జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement