సంక్షేమ వారధులు వలంటీర్లు

Felicitation Function To Volunteers By Local Mla Palnadu - Sakshi

సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత మీదే 

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి    

సాక్షి, పిడుగురాళ్ల:  వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించాలని ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7 వార్డుల్లో వలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో నిర్వహించబోయే జగనన్న బాట కార్యక్రమం ద్వారా ప్రతి గడప వద్దకు వెళతామని, ఎవరైనా సమస్య ఉందని చెబితే వలంటీర్లే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

అనంతరం 2, 3 వార్డు సచివాలయాల్లో ఒక సేవారత్న, 16 సేవా మిత్రాలు వచ్చిన వలంటీర్లను, 4, 5, 6, 7 వార్డుల్లో 45 సేవా మిత్రాలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త వెంకట సుబ్బారావు, వైస్‌చైర్మన్‌లు కొమ్ము ముక్కంటి, షేక్‌ జైలాబ్దిన్, పట్టణ కన్వీనర్‌ చింతా రామారావు, కౌన్సిలర్లు కొక్కెర శ్రీను, రొక్కం మధుసూదన్‌రెడ్డి, బండిగుంతల నాగమణి, అజ్మిర శారదాబాయి, పొలు శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు కుందుర్తి గురవాచారి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top