
సాక్షి,విజయవాడ: అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 కింగ్ పిన్, టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకి వచ్చిన జనార్ధన్ రావును గన్నవరం ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.
నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో గత నెల 24న ఆఫ్రికా వెళ్లిన జనార్ధన్ రావు ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కూడా చదవండి:
‘చంద్రబాబు కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?’