
సాక్షి, విజయవాడ: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణలంకలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజలంతా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిని చంపేశామంటూ చంద్రబాబు అండ్ కో వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా సీఎం జగన్ అమరావతిని అభివృద్ధి చేస్తారని ప్రజలంతా విశ్వసిస్తున్నారని అవినాష్ పేర్కొన్నారు.