బాలింత మృతి.. ఆళ్ల నాని సీరియస్‌

Deputy CM Alla Nani Serious On Postnatal Mother Death - Sakshi

ఆర్‌ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

సాక్షి, పశ్చిమగోదావరి:  వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటనపై మృతి ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర వివరాలను డీఎంహెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం..వేలేరుపాడులోని రామవరానికి చెందిన నాగమణి అనే  నిండు గర్భిణి ప్రసవం కోసం స్థానిక వేలేరు పాడులోని శ్రీనివాస నర్సింగ్‌ హోంలో మంగళవారం రాత్రి చేరింది. ప్రసవం కష్టం కావడంతో ఆమెకు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తరువాత నాగమణి ఫిట్స్‌తో మృతి చెందింది. ఈ ఘటనపపై సీరియస్‌ అయిన ఆళ్ల నాని ..ఎలాంటి అర్హతలు లేకుండా కాన్పు చేసిన  ఆర్‌ఎంపీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఆర్‌ఎంపీలు పరిధి దాటి వైద్యం అందిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. బాలింత మృతిపై సీనియర్‌ గైనకాలజిస్టు విచారణాధికారిగా నియమించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top