స్వగ్రామానికి తెలుగు దంపతుల కుమార్తెలు  | Couple America Snow Storm Home town Childrens | Sakshi
Sakshi News home page

స్వగ్రామానికి తెలుగు దంపతుల కుమార్తెలు 

Jan 1 2023 7:01 AM | Updated on Jan 2 2023 2:27 PM

Couple America Snow Storm Home town Childrens - Sakshi

ఇద్దరు కుమార్తెలతో నారాయణ, హరిత దంపతులు (ఫైల్‌) 

సాక్షి, ప్రత్తిపాడు: అమెరికాలో దుర్మరణం చెందిన తెలుగు దంపతుల కుమార్తెలు ఆదివారం స్వగ్రామానికి రానున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లిన దంపతులు సరస్సులో గల్లంతై, మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. వారి ఇద్దరు కుమార్తెలు పూజిత, హర్షితలు ఒంటరిగా మిగిలిపోయారు.

తానాతో పాటు నారాయణ పనిచేస్తున్న టీసీఎస్‌ కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకుని ఇద్దరు చిన్నారులను భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం చిన్నారులను తీసుకుని టీసీఎస్‌ ప్రతినిధులు అమెరికాలోని డల్లాస్‌ నుంచి భారతదేశానికి బయల్దేరారు. ఆదివారం ఉదయానికి హైదరాబాద్‌ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి తీసుకువచ్చి నాయనమ్మ వెంకటరత్నం, తాతయ్య సుబ్బారావుకు చిన్నారులను అప్పగిస్తారని బంధువులు చెప్పారు. నారాయణ, హరిత మృతదేహాలు ఇక్కడకు వచ్చేందుకు మరికొద్ది రోజులు పడుతుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement