కరోనా మృతుల అంత్యక్రియలు చూస్తారా

Corona Death Body's funeral Recording In Video - Sakshi

ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితుల్లో వీడియో వీక్షించవచ్చు

కరోనా మృతుల బంధువులకు ఫోన్లు చేసి బేరసారాలు

అంత్యక్రియలకు వేలల్లో గుంజుతున్న వైనం

వద్దన్నా వినకుండా వేధింపులు

ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటూ విన్నపాలు

అమలాపురం టౌన్‌ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేసిన పరిణామాలు చూశాం. అమలాపురం ప్రాంతంలో కొంతమంది మరో అడుగు ముందుకేసి కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా సరికొత్త బేరసారాలకు దిగుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి మృతదేహాలను కుటుంబీకులు, బంధువులు వచ్చి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని అమలాపురంలో కొందరు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో మృతదేహానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్‌ చేస్తున్న సంఘటనలు ‘సాక్షి’ దృష్టికి వచ్చాయి.

ఆసుపత్రి వద్దే నిఘా...   
అమలాపురం కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఎవరైనా మృతి చెందితే చాలు...ఆ సమాచారం కోసం అంత్యక్రియలు చేసేవారు ఆ ఆస్పత్రుల వద్ద కాచుకుని కూర్చుంటున్నారు. సీరియస్‌గా ఉండే కోవిడ్‌ బాధితుల కుటుంబీకుల ఫోన్‌ నంబర్లు ముందుగానే సేకరించి మరీ ఫోన్లు చేసి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. అంత్యక్రియలు మీరు దగ్గరుండి చూసే అవకాశం లేదు కాబట్టి మృతుని అంత్యక్రియలను వీడియో తీసి ఆ తృప్తిని మీకు అందిస్తాం ... అందుకు రూ.10 వేలు ఖర్చవుతుంద’ని బేరసారాలకు దిగుతున్నారు. మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన ప్రక్రియంతా శాస్త్రోక్తంగా శ్మశానంలో పూర్తి చేస్తాం...ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందంటూ లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు.

వామ్మో... వదిలించుకోవడం ఎలా... 
అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పట్టణంలోని ఓ కోవిడ్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. మరణించిన పది నిమిషాలకు ఈ తరహా ఫోన్లు మొదలయ్యాయి. మరణించిన వ్యక్తికి ముగ్గురు కుమారులు. ఓ కుమారుడు ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటారు. తండ్రి మరణించాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అమలాపురం రాలేకపోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు కూడా పదేపదే ఫోన్లు చేసి ‘వీడియో తీస్తా’మంటూ  విసిగించడంతో ఆ బాధితుడు మీడియాకు సమాచారం అందించాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు కుమారులకు కూడా సెంటిమెంట్‌ మాటలతో వీడియో...శాస్త్రోక్త పక్రియలంటూ ఫోన్లు చేసి ప్యాకేజీలంటూ వెంటపడ్డారు.  ఇలాంటి అనుభవాలు గత రెండు వారాలుగా అమలాపురంలో మొదలయ్యాయని పలు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.వేలు గుంజుతున్న వైనంపై ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ రాజు దృష్టి సారించారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ఫోన్ల బేరసారాలపై కూడా ఆయన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

19-10-2020
Oct 19, 2020, 09:00 IST
కైవ్‌: కరోనా వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు...
19-10-2020
Oct 19, 2020, 08:42 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 26,027 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు...
19-10-2020
Oct 19, 2020, 04:32 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ...
19-10-2020
Oct 19, 2020, 03:19 IST
సాక్షి, అమరావతి: కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో...
19-10-2020
Oct 19, 2020, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు...
18-10-2020
Oct 18, 2020, 15:48 IST
సాక్షి, న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నియంత్రణ విషయంలో...
18-10-2020
Oct 18, 2020, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం...
18-10-2020
Oct 18, 2020, 10:25 IST
న్యూఢిల్లీ: దేశ్యాప్తంగా కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు చేరింది....
18-10-2020
Oct 18, 2020, 09:55 IST
లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. బిహార్‌లోనూ పంజా...
17-10-2020
Oct 17, 2020, 18:59 IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
17-10-2020
Oct 17, 2020, 17:53 IST
రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది.
17-10-2020
Oct 17, 2020, 14:52 IST
కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
17-10-2020
Oct 17, 2020, 14:05 IST
సాక్షి, హైదరాబాద్‌: న‌టుడు జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు....
17-10-2020
Oct 17, 2020, 12:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌...
17-10-2020
Oct 17, 2020, 11:50 IST
తిరువనంతపురం : దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల...
17-10-2020
Oct 17, 2020, 10:38 IST
వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి...
17-10-2020
Oct 17, 2020, 09:49 IST
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 62,212 పాజిటివ్‌...
17-10-2020
Oct 17, 2020, 09:05 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,497 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు...
16-10-2020
Oct 16, 2020, 20:04 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 74,337 సాంపిల్స్‌ పరీక్షించగా.. 3,967మందికి...
16-10-2020
Oct 16, 2020, 19:42 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లోని ఇప్స్‌విచ్‌ నగరానికి సమీపంలోని బర్హామ్‌కు చెందిన షాట్‌ గన్‌ లీడర్‌ పీటర్‌ హాట్‌షోర్న్‌ జోన్స్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top