వైఎస్సార్‌ రైతు భరోసా నగదు పంపిణీ చేయనున్న సీఎం జగన్‌

CM YS Jagan Will Distribute YSR Rythu Bharosa Cash At Tenali - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. 

షెడ్యూల్‌ ఇదే.. 
- సీఎం జగన్‌ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. 
- ఉదయం 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.
- నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
- అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top