14న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం సందర్శన | CM YS Jagan Visit To Polavaram On 14th December | Sakshi
Sakshi News home page

14న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం సందర్శన

Dec 12 2020 3:02 AM | Updated on Dec 12 2020 1:35 PM

CM YS Jagan Visit To Polavaram On 14th December - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. పోలవరం డ్యామ్‌ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎంత మేర పనులు జరుగుతున్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.

అనంతరం అక్కడ సమావేశ మందిరంలో పనులు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు పోలవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

Advertisement
 
Advertisement
Advertisement