వైఎస్‌ జగన్‌: నేడు ఢిల్లీకి సీఎం | YS Jagan's Delhi Tour Today to Meet Amit Shah - Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌

Sep 22 2020 3:41 AM | Updated on Sep 22 2020 1:25 PM

CM YS Jagan To Visit Delhi On 22nd September - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  సీఎం వైఎస్‌ జగన్‌ నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం ఢిల్లీలో అమిత్‌ షా తో భేటీ కానున్నారు.

రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement