CM YS Jagan Tweets About Skill Development Scam - Sakshi
Sakshi News home page

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

Published Mon, Mar 20 2023 7:40 PM

CM YS Jagan Tweets About Skill Development Scam - Sakshi

తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై అసెంబ్లీలో ఈరోజు(సోమవారం)వాడి వేడి చర్చ జరిగింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ను చంద్రబాబు అండ్‌ కో ఎంత చాకచక్యంగా చేశారో అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వివరించారు.  అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లో స్కామ్‌పై అసెంబ్లీలో ప్రస్తావించిన కొన్ని అంశాలను సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

‘అర్హులైన వారికి నేరుగా నగదు జమ చేసే డీబీటీని ఈ ప్రభుత్వం చేస్తుంటే..గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో...  అనే డీపీటీ కార్యక్రమం చేసింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్ పేరుతో రూ. 371 కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగింది. దోపిడీచేసిన వారు చట్టం నుంచి, ప్రజలనుంచి తప్పించుకోలేరు’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, స్కిల్‌ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని అసెంబ్లీలో గత చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు సీఎం జగన్‌. ‘రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్‌ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్‌ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్‌డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్‌ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్‌లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్‌ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది’ అని సీఎం జగన్‌ స్పష్ఠం చేశారు.

చదవండి: దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ ఇది: సీఎం జగన్‌

Advertisement
Advertisement