‘ఆడుదాం ఆంధ్రా’కు రిజిస్టర్‌ చేస్కోండి: సీఎం జగన్

Cm Ys Jagan Tweet On Adudam Andhra - Sakshi

సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోనే అతిపెద్ద రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’.. ఈ కార్యక్రమాన్ని ప్రకటించటంపై  సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

‘‘రాష్ట్రంలోని ప్రతి సచివాలయం పరిధిలో మ్యాచ్‌లు నిర్వహించబడుతున్నాయి. మన యువతకు అత్యుత్తమ అవకాశం ఉంటుంది. వారి క్రీడా ప్రతిభను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. మన దేశపు తదుపరి క్రీడా ఛాంపియన్‌లుగా మారండి. ఇప్పుడే aadudamandhra.ap.gov.in లో పేరు నమోదు చేసుకోండి’’ అంటూ సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది.

క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్‌) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్‌ మీట్‌’ను చేపడుతున్నది. యువతలో క్రీడా­స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభా­గాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్‌ పోటీలను ఏర్పాటు చేస్తోంది.

చదవండి: ఆటకు అందలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top