గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్‌ స్మృతివనం

CM YS Jagan Review On Ambedkar Statue Construction Works In Vijayawada - Sakshi

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం  

సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్‌ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. 

ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు.. సీఎంకు వివరించారు.

అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. ‘‘విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలి. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్‌కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి’’ అని సీఎం జగన్ సూచించారు.
చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్‌ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జి విజయ్‌ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top