రేపు బెంగళూరుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ | CM YS Jagan To Go Bengaluru On 25th August | Sakshi
Sakshi News home page

రేపు బెంగళూరుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Aug 24 2020 4:44 AM | Updated on Aug 24 2020 4:44 AM

CM YS Jagan To Go Bengaluru On 25th August - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26వ తేదీ కూడా అక్కడే ఉంటారు. 27న తాడేపల్లి నివాసానికి తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు వచ్చిందని, తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్‌ జగన్‌ బెంగళూరుకు వెళుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఇన్సీడ్‌ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్‌ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయడానికి మొగ్గుచూపారు.  

Advertisement
 
Advertisement
Advertisement