కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి | CM YS Jagan Expresses Condolences For The Victims Of Karnataka Accident | Sakshi
Sakshi News home page

కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Oct 26 2023 12:17 PM | Updated on Oct 26 2023 12:34 PM

CM YS Jagan Expresses Condolences For The Victims Of Karnataka Accident - Sakshi

సాక్షి, తాడేపల్లి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘చిక్ బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

Advertisement
 
Advertisement
Advertisement