
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. రమణారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు.