ఆనందయ్య మందుపై ఫలితాలు రాగానే నిర్ణయం 

CM YS Jagan on Anandaiah Covid Ayurvedic Medicine - Sakshi

ఆనందయ్య మందుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

శాంపిళ్లను సీసీఆర్‌ఏఎస్‌కు పంపామన్న ఆయుష్‌ కమిషనర్‌ 

కంట్లో డ్రాప్స్‌పైనా నిపుణులతో పరిశీలన 

అధికారులకు సీఎం ఆదేశం 

సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు సంబంధించి ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌’ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపిన శాంపిళ్ల ఫలితాలు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, చికిత్సపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య మందులో వినియోగిస్తున్న పదార్థాల గురించి రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు ముఖ్యమంత్రికి వివరించారు. ఆనందయ్య మందుల్లో కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కంట్లో డ్రాప్స్‌పై పరిశీలన ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆనందయ్య మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని కమిషనర్‌ వివరించారు. ఈ మందు శాంపిళ్లను సీసీఆర్‌ఏఎస్‌కు పంపామని, వాళ్లు 500 మందికి ఇచ్చి పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మందు వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో నివేదిక వస్తుందని అధికారులు చెప్పారు.

30–35 ఏళ్లగా మందులు ఇస్తున్నారు
కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందులు ఇస్తున్నారని ఆయుష్‌ కమిషనర్‌ రాములు సమావేశంలో తెలిపారు. కరోనాకు నోటి ద్వారా 4 రకాల మందులు, కళ్లలో డ్రాప్స్‌.. ఇలా 5 రకాల మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ మందుల్లో ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని చెప్పారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె.. ఇలా 18 రకాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారని వివరించారు. అన్నీ సహజంగా దొరికే పదార్థాలేనని, వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని చెప్పారు. మందుల తయారీ విధానాన్ని తమకు చూపించారని, ఫార్ములా కూడా చెప్పారని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-05-2021
May 25, 2021, 10:19 IST
ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తున్న వారి కథనాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు నాలో కొత్త ఆశను...
25-05-2021
May 25, 2021, 10:13 IST
న్యూఢిల్లీ: రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌), భారత ఔషధ దిగ్గజం పనాసియా బయోటెక్‌లు స్పుత్నిక్‌–వి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీని...
25-05-2021
May 25, 2021, 09:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద కోవిడ్‌ టూల్‌కిట్‌ కేసులో ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ ట్విట్టర్‌ యాజమాన్యానికి సోమవారం నోటీసు జారీ...
25-05-2021
May 25, 2021, 08:57 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళ వారం (నేటి) నుంచే పునఃప్రారంభమవుతోంది. ఈ మేరకు...
25-05-2021
May 25, 2021, 07:55 IST
చండీగఢ్‌: కరోనా వైరస్‌ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని...
25-05-2021
May 25, 2021, 05:31 IST
ప్రైవేట్‌ వైద్యులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ బాటపట్టారు. కోవిడ్, ఇతర రుగ్మతల బారిన పడిన వారికి ఫోన్, వాట్సప్‌ ద్వారా చికిత్సలను...
25-05-2021
May 25, 2021, 04:57 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏటా 8...
25-05-2021
May 25, 2021, 04:49 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇకపై 18–44 ఏళ్ల వయసు వారు ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌...
25-05-2021
May 25, 2021, 04:38 IST
సింగపూర్‌: కరోనా పాజిటివా? లేక నెగెటివా? అనేది కేవలం ఒక్క నిమిషంలో నిర్ధారించే బ్రీథలైజర్‌ టెస్టుకు సింగపూర్‌ ప్రభుత్వ అధికార...
25-05-2021
May 25, 2021, 03:46 IST
సాక్షి, అమరావతి: అవసరం మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి...
25-05-2021
May 25, 2021, 02:52 IST
వాషింగ్టన్‌/బీజింగ్‌: ప్రపంచ పాలిట పెనుగండంగా మారిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(వూహాన్‌ ల్యాబ్‌)లోనే పుట్టిందా? అది...
25-05-2021
May 25, 2021, 02:51 IST
విద్యుత్తు.. ఆక్సిజన్‌ కీలకం ‘‘తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. తుపాను వల్ల ఒడిశా ప్లాంట్ల...
25-05-2021
May 25, 2021, 02:45 IST
కరోనా పొట్టగొట్టింది. ఆకలి రోడ్డెక్కింది. దాతల సాయం కోసం బతుకు‘బండి’ ఇలా బారులుదీరింది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు...
25-05-2021
May 25, 2021, 02:32 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్‌–19 పాలసీని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. టీకాల...
24-05-2021
May 24, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి...
24-05-2021
May 24, 2021, 16:18 IST
కరోనా బాధితుల్లో ప్రస్తుతం నీళ్ల విరేచనాలు సర్వ సాధారణంగా కనిపిస్తున్న లక్షణం. బాధితుల విసర్జితాల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ లేదా జెనెటిక్‌...
24-05-2021
May 24, 2021, 15:17 IST
దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి
24-05-2021
May 24, 2021, 15:13 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి ముదరకుండా చేసే యాంటీబాటీ కాక్‌టెయిల్‌...
24-05-2021
May 24, 2021, 15:02 IST
ముంబై: మహమ్మారి కరోనాపై పోరులో అండగా ఉండేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో కోవిడ్‌...
24-05-2021
May 24, 2021, 14:51 IST
భోపాల్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది కరోనా బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top