నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం | Cm Jagan Review On Municipal And Urban Development Department | Sakshi
Sakshi News home page

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

Oct 27 2023 1:26 PM | Updated on Oct 27 2023 6:04 PM

Cm Jagan Review On Municipal And Urban Development Department - Sakshi

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.

సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, అర్భన్‌ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ బి సుబ్బారావు, టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్‌ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. 

సీఎం ఆదేశాలు ఇవే..
►వర్షాకాలం ముగిసి పనుల సీజన్‌ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. 
►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి.
►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
​​​​​​​►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్‌ చేసి వినియోగించేలా చూడాలి.
​​​​​​​►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 
​​​​​​​

►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. 
​​​​​​​►ముడసర్లోవ పార్క్‌ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో కమర్షియల్‌ కాంప్లెక్స్, మల్టీ లెవల్‌ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. 
​​​​​​​►విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి.
​​​​​​​►కన్వెన్షన్‌ సెంటర్‌, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి.
​​​​​​​

​​​​​​​►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
​​​​​​​►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి. 
​​​​​​​►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి. 
​​​​​​​►ప్లోటింగ్‌ సోలార్‌ ప్యానెల్స్, ఎస్‌టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం తెస్తున్న అత్యాధునిక యంత్రాలను సద్వినియోగం చేయాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement