ఆరోగ్యశ్రీ తొలగింపునకు చంద్రబాబు కుట్రలు.. | CM Chandrababu Plans To Remove Aarogyasri Scheme | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ తొలగింపునకు చంద్రబాబు కుట్రలు..

Jan 4 2025 9:29 AM | Updated on Jan 4 2025 10:49 AM

CM Chandrababu Plans To Remove Aarogyasri Scheme

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పథకాల అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. తాజాగా కూటమి సర్కార్‌ మరో కుట్రకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీని తొలగించేందుకు చంద్రబాబు సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించాలని ప్లాన్ చేస్తోంది.

ఏపీలో కూటమి సర్కార్‌ ఆరోగ్యశ్రీపై కుట్రలు చేస్తోంది. వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించాలని ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు శరాఘాతంగా మారనుంది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు ఒక్కసారిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిమితి దాటితే బీమా కంపెనీలు వైద్య ఖర్చులు చెల్లించే అవకాశం లేదు.

ఇక, వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.25 లక్షల విలువైన వైద్యం కూడా ఆసుపత్రుల్లో ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు చెల్లించేది కేవలం రూ.2 నుంచి 2.5 లక్షలలోపే ఉంటుంది. దీంతో​, పేదలు వైద్యం కోసం మళ్లీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రానుంది. మరోవైపు.. చంద్రబాబు నిర్ణయాలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement