వైఎస్‌ జగన్ భద్రత, రక్షణపై కూటమి సర్కార్‌ కుట్ర! | Chandrababu Kutami Govt Security Breach Over YS Jagan Tours, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్ భద్రత, రక్షణపై కూటమి సర్కార్‌ కుట్ర!

Jun 22 2025 1:50 PM | Updated on Jun 22 2025 3:30 PM

Chandrababu Govt security breach Over YS Jagan Tours

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించే విషయంలో కూటమి సర్కార్‌ చోద్యం చూస్తోంది. వైఎస్‌ జగన్‌ భద్రత, రక్షణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆయనకు Z+ కేటగిరీ భద్రత కల్పించటంలో ప్రభుత్వ పెద్దల ఘోర వైఫల్యం చెందారు. వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించే విషయంలో హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వ తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇంటి వద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్‌ జగన్ ఇంటి దగ్గర కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొందరు దుండగులు శనివారం సాయంత్రం కారులో వచ్చి తాటికాయలు విసిరేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించ లేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదు.

ఇక, వైఎస్‌ జగన్‌ పర్యటన సమయాల్లో కూడా ప్రభుత్వం, పోలీసులు నుంచే ఇలాంటి నిర్లక్ష్య ధోరణే కనిపిస్తోంది. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. వైఎస్‌ జగన్ వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. అయితే, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని వారు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement