పేదలందరికీ ఇళ్లపై కేంద్ర బృందం పరిశీలన

Central team inspects homes for poor people in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం అమలు, గృహనిర్మాణాల తీరును పరిశీలించేందుకు 25 మంది సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వ సచివాలయ బృందం గురువారం కృష్ణాజిల్లా వణుకూరు లేఅవుట్‌ను పరిశీలించింది. అక్కడ 621 ఇళ్ల నిర్మాణాలను చూసింది. తమ శిక్షణలో భాగంగా ఏపీ మానవ వనరుల అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంలోని కార్యదర్శులు, సెక్షన్‌ అధికారుల బృందం ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సందర్శించింది.

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌పాండే, జాయింట్‌ మేనేజర్‌ ఎం.శివప్రసాద్‌ పేదల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా లేఅవుట్లలో కల్పిస్తున్న విద్యుత్, డ్రెయినేజీ, అంతర్గత రోడ్లు, నీటిసరఫరా వంటి మౌలిక సదుపాయాలను వివరించారు. 30 లక్షల మంది మహిళల పేరుతో 71,811 ఎకరాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. రూ.55 వేల కోట్లతో 2 దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం 20 టన్నుల ఇసుకతో పాటు సిమెంట్, ఇనుము, ఎలక్ట్రికల్, శానిటరీ వస్తువులను మార్కెట్‌ ధరల కంటే తక్కువకు సరఫరా చేస్తోందని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top