Police Cases Registered Against Sai Priya And Her Lover In Visakhapatnam - Sakshi
Sakshi News home page

ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌

Aug 29 2022 10:34 AM | Updated on Aug 29 2022 2:27 PM

Case File Against Saipriya who Disappeared at RK Beach - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియపై 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ప్రియుడు రవితో కలిసి సాయిప్రియ పరారైన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతరం సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ రామారావు వెల్లడించారు.   

చదవండి: (నేను రవితోనే ఉంటా..సాయిప్రియ)

Advertisement
 
Advertisement
Advertisement