‘నాన్న.. దుబాయ్‌ నుంచి రాంగ సెల్‌ఫోన్ తీసుకురా అన్నావే’ | Boy Drowned In Village Pond Jagtial | Sakshi
Sakshi News home page

‘నాన్న.. దుబాయ్‌ నుంచి రాంగ సెల్‌ఫోన్ తీసుకురా అన్నావే’

Apr 6 2022 2:52 PM | Updated on Apr 6 2022 4:29 PM

Boy Drowned In Village Pond Jagtial - Sakshi

నాన్న.. దుబాయ్‌ నుంచి రాంగ సెల్‌ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి.

సాక్షి,ధర్మపురి: ‘నాన్న.. దుబాయ్‌ నుంచి రాంగ సెల్‌ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్‌ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్‌.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి  ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే.  

చివరిచూపు కోసం..
చెరువులో ఆదివారం మృతిచెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్‌ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్‌ మృతదేహానికి తండ్రి సతీశ్‌ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్‌కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్‌ నుంచి తండ్రి కిషన్‌ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది.

చదవండి: Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్‌.. కేటీఆర్‌ సీరియస్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement