‘తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది’

Bosta Satyanarayana Key Comments On Skill Scam During TDP Regime - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఈ స్కామ్‌లో ఉండబట్టే దర్యాప్తు చేయలేదు. తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సీమెన్స్‌ పేరుతో చంద్రబాబు దోపిడీపై అసెంబ్లీలో చర్చించాం. రేపు కూడా స్కిల్‌ డెవలప్మెంట్‌ దోపిడీపైనే చర్చిస్తాం. తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది. 2004లో వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆరోజు ఎంత క్షోభ అనుభవించానో నాకు తెలుసు. ఆరోజు మేమే సీబీఐ విచారణ కోరాం. 

ఈరోజు స్కిల్ డెవలప్మెంట్‌లో 330 కోట్ల దోపిడీ జరిగితే ఎందుకు కేంద్ర సంస్థల దర్యాప్తు కోరలేదు. ఈ కుంభకోణాన్ని జీఎస్టీ, ఈడీ సంస్థలు గుర్తించినా ఎందుకు స్పందించలేదు. చంద్రబాబు ఈ స్కామ్‌లో ఉండబట్టే ఆయన దర్యాప్తు చేయించలేదు. ఒకటి, రెండు గెలుపోటములు వస్తుంటాయి. ఇందులో ఏం జరిగిందో విశ్లేషించుకుంటాం అని స్పష్టం చేశారు.  

ఇది కూడా చదవండి: తెలుగుదేశం పార్టీ వైరస్‌ లాంటిది: సజ్జల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top