BJP Subramanian Swamy Slams Chandrababu Naidu And His Support Media- Sakshi
Sakshi News home page

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మండిపాటు

Jan 28 2021 3:22 PM | Updated on Jan 28 2021 5:05 PM

bjp mp subramanya swamy slams chandrababu naidu and his support media for making false stories on tirumala - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంపై(టీటీడీ) ఎల్లో మీడియాలో వస్తున్న అసత్య కధనాలపై విసుగు చెందానని, త్వరలో చంద్రబాబు, ఆయన అనుకూల పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మండి పడ్డారు. పవిత్రమైన వెంకన్న సన్నిధిపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ విషయంపై తన సహచరుడు సత్యపాల్‌ సభర్వాల్‌తో కలిసి త్వరలో తిరుపతి పట్టణ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement