
సాక్షి, అమరావతి: మొహర్రం త్యాగనిరతికి ప్రతీకని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమరవీరులను మొహర్రం గుర్తుకు చేస్తుందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్లకే పరిమితమై మొహర్రం కార్యక్రమాలు నిర్వహించు కోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు.