బాబు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి

Bahujana Parirakshana Samiti Leaders Fires On Chandrababu Naidu - Sakshi

బహుజన పరిరక్షణ సమితి నాయకుల డిమాండ్‌

మూడు రాజధానులకు మద్దతుగా 169వ రోజుకు చేరిన దీక్షలు

తాడికొండ: రాజధాని పేరిట రూ.3.50 లక్షల కోట్లు లూటీ చేసిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ వేసి రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 169వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే సీఆర్డీఏ చైర్మన్‌గా ఉండి దళితుల్ని మోసగించి రూ.2 వేల కోట్లను దోపిడీ చేశారని  ఆరోపించారు.

చంద్రబాబు బయట తిరిగితే వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపుల ద్వారా కేసును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయనను వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని దోచుకొని తండ్రీకొడుకులు దాచిన అవినీతి హెరిటేజ్‌ సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, బూదాల సలోమీ, కొలకలూరి లోకేష్, పులిదాసు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top