జాలరికి చిక్కిన బాహుబలి చేప.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

Bahubali Fish Caught Fisherman Goes Viral Andhra Pradesh - Sakshi

సాధారణంగా జీవనోపాధికోసం వేటకు వెళ్లే జాలర్లు ఎంతో కష్ట పడితే తప్ప.. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. ఒక్కోసారి రోజులు గడిచిన ఒడ్డుకు రాలేని పరిస్థితి. ఎక్కువగా చేపలు వలకు చిక్కితేనే వారు తమ కుటుంబాలను పోషించగలరు, లేదంటే పిండి కొద్ది రొట్టేలా వారి జీవనం సాగిపోతుంటుంది. అందుకే జాలర్ల జీవితం నిత్య పోరాటమని అంటుంటారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారునికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఏకంగా భారీ బరువు గల చేపనే ఓ జాలరికి చిక్కింది. ఈ చేప బరువు అక్షరాలా 20 కిలోలు. ఇది చేపల్లో బాహుబలి. వంశధార రిజర్వాయర్‌లో మంగళవారం జాలరులకు చిక్కింది. ఈ చేపను చూడడంతో పాటు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. చివరికి ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజకు చెందిన చేపల వ్యాపారి రామారావు రూ.3 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. 

చదవండి: చికెన్‌ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top