సీఎం జగన్‌ సహకారం మరువలేనిది.. | Badminton player Srikanth Praises CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సహకారం మరువలేనిది..

Jan 1 2022 6:27 AM | Updated on Jan 1 2022 3:20 PM

Badminton player Srikanth Praises CM YS Jagan Mohan Reddy - Sakshi

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు శ్రీకాంత్‌ను సన్మానిస్తున్న ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ చెప్పారు. శుక్రవారం తిరుపతికి వచ్చిన ఆయన ఎంపీ గురుమూర్తిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు ఎంపీ గురుమూర్తి సహకారంతో తిరుపతిలో ఐదెకరాల స్థలాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించడం అభినందనీయమన్నారు.

తిరుపతిలో బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా యువతను చాంపియన్స్‌గా తీర్చిదిద్దుతానన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తానని శ్రీకాంత్‌ చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement