మాజీ మంత్రుల బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు

Arguments In Court Over Former TDP ministers Bail Petition Are Over - Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. విచారణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. శనివారం కొల్లు రవీంద్ర తరపున వాదనలను న్యాయమూర్తి విన్నారు. అయితే సోమవారం రోజున ప్రాసిక్యూషన్ వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. కాగా.. వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై కూడా సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top