తిరుమలకు త్వరలో బ్యాటరీ బస్సులు | APSRTC Says Battery bus Services Start In Tirumala Soon | Sakshi
Sakshi News home page

తిరుమలకు త్వరలో బ్యాటరీ బస్సులు

Jul 27 2021 8:54 AM | Updated on Jul 27 2021 8:55 AM

APSRTC Says Battery bus Services Start In Tirumala Soon - Sakshi

తిరుమల ఆర్టీసీ డిపోను పరిశీలిస్తున్న ఎండీ ద్వారకా తిరుమలరావు

తిరుమల: త్వరలోనే తిరుమలకు బ్యాటరీ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందుకు సంబంధించి డిపో ఏర్పాటుకు స్థలాలను పరిశీలించినట్టు చెప్పారు. ఆయన సోమవారం తిరుమల ఆర్టీసీ డిపోను పరిశీలించారు. బ్యాటరీ బస్సుల కోసం పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. అనంతరం డిపోలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుమల ఆర్టీసీ డీఎం ఎంవీఆర్‌ రెడ్డి, నెల్లూరు ఈడీ గోపీనాథ్‌రెడ్డి, తిరుపతి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement