ప్రభుత్వ లక్షాన్ని సాధించడమే సెబ్‌ ధ్యేయం

AP SEB Commissioner Warns Government Officials Over Smuggling - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను సక్సెస్ ఫుల్‌గా కట్టడి చేశాం. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)కి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది అన్నారు సెబ్‌ (ఎస్‌ఈబీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. ఈ సందర్భంగా సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ..  ‘సెబ్‌ పరిధిలో 4వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా 106 మంది సిబ్బందిని అదనంగా పెంచారు. గంజాయి, గుట్కా, ఎర్ర చందనం స్మగ్లింగ్, ఆన్‌లైన్ గాంబ్లింగ్‌లను కూడా ప్రభుత్వం సెబ్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్, గాంబ్లింగ్ అడుతూ యువకులు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. మాఫియాల మూలాలు కనిపెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్)

ఎర్ర చందనంపై ప్రత్యేక నిఘా ఎర్పాటు చేస్తాం. ఫారెస్ట్, పోలీస్ శాఖలను సమన్వయ పరుచుకొని ఎర్రచందనం రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. కొండకింద గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి స్మగ్లర్ల భరతం పడతాం. అక్రమ రవాణాని అడ్డుకొనేందుకు  రాష్ట్ర సరిహద్దులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అక్రమార్కులకు సహకరిస్తే ప్రభుత్వాధికారులను కూడా వదలం. ప్రభుత్వ లక్షాన్ని ఛేదించటమే లక్ష్యంగా సెబ్‌ ముందుకు సాగుతుంది అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top