
సాక్షి, అమరావతి: ఏపీలో ఎట్టకేలకు పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
పోలీస్ శాఖలో ఉన్న తీవ్ర సిబ్బంది కొరతను అధిగమించేందుకు 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్, 2023లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 డిసెంబర్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. అయితే..
రిజల్ట్ కోసం క్లిక్ చేయండి👉 https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspx
PETలో అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు ఈ ఏడాది జూన్ 1వ తేదీన మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించారు. అటుపై ఓఎంఆర్ షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచారు. ఫలితాల విడుదల న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లు SLPRB చెబుతూ వచ్చింది. ఈ తరుణంలో జూలై 30న విడుదల చేయాల్సిన ఫలితాలు.. ఆలస్యంగా ఇవాళ(ఆగస్టు 1న) విడుదలయ్యాయి.