పంచాయతీ ఎన్నికలు: మీ ఓటు ఇలా వేయండి

AP Panchayat Elections: Do You Know How TO Cast Vote, Here It Is - Sakshi

సాక్షి, కాకినాడ : తొలి విడత ఎన్నికల పోలింగ్‌ మంగళవారం జరగనుంది. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థమైన నాయకుడుకి ఓటు వేయాలి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

► ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పు తప్పనిసరి.
► ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఫొటోలతో ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. 
►  ఒక వేళ ఎవరికైనా ఓటరు స్లిప్పు అందకపోతే వారు పోలింగ్‌ కేంద్రం వద్ద పంచాయతీ కార్యాలయ సిబ్బంది అక్కడే ఓటరు స్లిప్పులు అందిస్తారు. 
►  ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. 
►  ఓటరు కార్డు, ఆధార్, రేషన్, బ్యాంకు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు ఇలా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. 
►  కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడాలి. 
►  తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌ ఉండాలి. 
►  క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది రెండు బ్యాలెట్లు ఇస్తారు. 
►  సర్పంచ్‌ బ్యాలెట్, వార్డు సభ్యుడి బ్యాలెట్‌ ఇస్తారు. వాటితోపాటు స్వస్తిక్‌ గుర్తు సిరాలో ముంచి ఇస్తారు. 
►  బ్యాలెట్‌పై తనకు నచ్చిన వ్యక్తి గుర్తుపై స్వస్తిక్‌ గుర్తు వేయాలి.  
► పోలింగ్‌ సిబ్బంది చెప్పిన ప్రకారం బ్యాలెట్‌ను మడత పెట్టాలి. 
►  లేకుంటే మనం ఓటు వేసి సిరా వేరే గుర్తుపై పడే అవకాశం ఉంది. 
► ఇలా జరిగితే ఆ బ్యాలెట్‌ చెల్లదు.  
► ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు సహాయకుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంది. 
►  దీనికి ముందుగా సంబంధింత పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ అధికారి అనుమతి తీసుకోవాలి. 
►  వికలాంగులు, వృద్ధులు వారికి నచ్చిన వ్యక్తులను సహాయకులు ఎంచుకోవచ్చు. 
► కరోనా సోకిన వ్యక్తి ఓటు వేయడానికి అవకాశం కలి్పంచారు. 
► ఆఖరి గంటలో స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది సహాయంతో తగు భద్రతా ప్రమాణాలు పాటించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
►    ఓటు వేసి సెల్ఫీ తీసుకుంటే సంబంధిత ఓటును రద్దు చేసే అధికారం పోలింగ్‌ అధికారికి ఉంది. 

ఒక ఓటరు.. రెండు ఓట్లు
రాయవరం: గత పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటరు ఓటింగ్‌ యంత్రాలపై ఓటు వేయగా, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు బ్యాలెట్‌ పేపరుపై ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్‌ బరిలో నిలిచిన అభ్యర్థికి, మరో ఓటు బరిలో నిలిచిన వార్డు అభ్యరి్థకి వేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌ అభ్యర్థులకు గులాబీ, వార్డు అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపరును ఓటర్లకు అందజేస్తారు. సర్పంచ్‌ అభ్యర్థి పోటీలో ఉండి, వార్డు పదవి ఏకగ్రీవమైతే ఓటరు ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సర్పంచ్‌ పదవి ఏకగ్రీవమై, వార్డు పదవికి పోటీ జరిగితే అప్పుడు కూడా ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఇస్తారు.
చదవండి: ఏపీ: ఒకరి ఓటు మరొకరు వేస్తే ఏమవుతుంది?
పోలింగ్‌ సమయంలో సెల్ఫీ దిగితే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top