పోలింగ్‌ సమయంలో సెల్ఫీ దిగితే..

Ap Local Elections: Vote Will Cancel If You Take Selfie In Polling Time - Sakshi

సాక్షి, చిత్తూరు : ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఓటర్లు సెల్ఫీ దిగితే ఓటును రద్దు చేస్తారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఇదే అలవాటు తో పొరపాటుగా మంగళవారం జరిగే  పోలింగ్‌లో ఓటర్లు సెల్ఫీ దిగితే, ఆ వ్యక్తి వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 49 (ఎం) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి, ఇతరులకు షేర్‌ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 17 (ఏ)  ప్రకారం ఆ ఓటును రద్దు చేస్తారు.  
చదవండి: పంచాయతీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top