AP Panchayat Elections 2021 Phase 3, LIVE Updates, Results, Party Wise - Sakshi
Sakshi News home page

లైవ్‌ :ప్రారంభమైన మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Published Wed, Feb 17 2021 1:33 AM

AP Panchayat Elections 2021, Phase 3, LIVE Updates, Results, Winning Candidates - Sakshi

మధ్యాహ్నం 4.00
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,639 సర్పంచ్‌, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది.

మధ్యాహ్నం 3.30
మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 3:00
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.

మధ్యాహ్నం 2:30
పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అరకులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మాధవి
కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మధ్యాహ్నం 2:00
రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్‌ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది.

మధ్యాహ్నం. 1.30
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ సజావుగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు.

మధ్యాహ్నం. 1.00
మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ 66.48 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్‌ శాతాలు ఇలా ఉన్నాయి. 
► శ్రీకాకుళం- 64.14 శాతం
►విజయనగరం- 78.5శాతం
►విశాఖపట్నం- 63.23శాతం
►తూర్పు గోదావరి- 67.14శాతం
►పశ్చిమ గోదావరి- 53.51శాతం
►కృష్ణా- 65.88 శాతం
►గుంటూరు- 71.67 శాతం
►ప్రకాశం- 69.95శాతం
►నెల్లూరు- 69.82 శాతం
►చిత్తూరు- 64.82 శాతం
►కడప- 57.34 శాతం
►ర్నూలు- 71 .96 శాతం
►అనంతపురం- 70.23 శాతం

మధ్యాహ్నం 12.30
విశాఖపట్నం: జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. 

మధ్యాహ్నం 12.00
►అనంతపురం డివిజన్‌లోని 19మండలాల్లో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా  కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.

తూర్పుగోదావరి: రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పుల్లంగి, బొడ్లంక పంచాయతీ గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు.

ఉదయం. 11.30
పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి పలు గ్రామాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.

ఉదయం 11.00
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్‌ శాతాలు ఇలా ఉ‍న్నాయి. 

►శ్రీకాకుళం- 42.65 శాతం
►విజయనగరం- 50.7 శాతం‌
►విశాఖపట్నం- 43.35 శాతం 
►తూర్పు గోదావరి- 33.52 శాతం 
►పశ్చిమ గోదావరి- 32 శాతం‌
►కృష్ణా- 38.35 శాతం 
►గుంటూరు 45.90 శాతం
►ప్రకాశం 35.90 శాతం
►నెల్లూరు 42.16 శాతం
►చిత్తూరు 30.59 శాతం 
►వైఎస్ఆర్ కడప 31.73 శాతం
►కర్నూలు 48.72 శాతం0 
►అనంతపురం 48.15 శాతం

ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు
ఉదయం. 10.30
గుంటూరు: గురజాల మండలం మాడుగులలో పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావటంతో 12, 13 వార్డుల్లో పోలింగ్‌ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈనెల 21న రెండు వార్డులకూ ఎలక్షన్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

►పోలింగ్ కేంద్రాల వద్ద మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతలో 168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్ తర్వాత ఎవరైనా కక్ష సాధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఉదయం 10.00
విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైస్సార్‌సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

అనంతపురం: ఉరవకొండ మండలం రాకెట్లలో వైస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు  32.21 శాతం పోలింగ్‌నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.


ఉదయం. 9.30
పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.  
►శ్రీకాకుళం- 12.87 శాతం
►విజయనగరం- 15.3 శాతం
►విశాఖపట్నం- 13.75 శాతం
►తూర్పు   గోదావరి- 12.6 శాతం 
►పశ్చిమ గోదావరి- 11.72 శాతం‌
►కృష్ణా - 8.14 శాతం
►గుంటూరు 18.83 శాతం
►ప్రకాశం 8.04 శాతం 
►నెల్లూరు 9.1 శాతం
►చిత్తూరు 9.34 శాతం 
►వైఎస్ఆర్ కడప 7.5 శాతం
►కర్నూలు 15.39 శాతం 
►అనంతపురం 9.9 శాతం

ఉదయం. 9.00
►రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
►రాష్ట్రంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్‌లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం. 8.30
►వైఎస్సార్‌ కడపలో పంచాయతీ ఎన్నికల  పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 7.57 పోలింగ్‌ శాతం నమోదనట్లు అధికారులు పేర్కొన్నారు.
►విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటున్నారు. ఉదయం 7.30 గంటల వరకు 8.7 పోలింగ్‌ శాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ డా. ఎం. హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియను ఆయన కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఆరా తీస్తున్నారు.
ఉదయం.8.00
రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ప్రశాంతగా సాగుతోంది. మచిలీపట్నం నియజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి పోలింగ్‌ పక్రియను పరిశీలిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు.

ఉదయం. 7.30 
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఉదయం. 7.02
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉదయం 6.30 
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

ఉదయం. 6.25
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో మూడో విడత పోలింగ్‌ ఉదయం 6.30 గంటలకు మొదలు కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు.

7,757 మంది పోటీ:
2,639 సర్పంచ్‌ పదవులకు మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. 

సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ బుధవారం జరగనుంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు.

మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్‌ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్‌ కేంద్రాలు
మూడో విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్‌ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఓటర్లను పోలింగ్‌ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్‌కు అనుమతించనున్నట్టు ద్వివేది తెలిపారు.

కౌంటింగ్‌ ప్రక్రియలో 63,270 మంది
పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోనే కేవలం అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్‌ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

Advertisement
Advertisement