ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్‌ ఆపి 

AP Ministers Stops Convoy To Listen To Peoples Problems - Sakshi

భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్‌ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు.

క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్‌కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్‌ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top