‘పంచాయతీ’లో జోక్యానికి హైకోర్టు నో | AP High Court refused to intervene in the matter of panchayat elections | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ’లో జోక్యానికి హైకోర్టు నో

Jan 30 2021 5:51 AM | Updated on Jan 30 2021 5:51 AM

AP High Court refused to intervene in the matter of panchayat elections - Sakshi

సాక్షి, అమరావతి:  పంచాయతీ ఎన్నికల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేలి్చచెప్పింది. సర్పంచ్‌ సీట్ల ఖరారు సక్రమంగా లేదని, ఓటుహక్కు కల్పించట్లేదని, ఓటరు గుర్తింపు కార్డున్నా ఓటర్ల జాబితాలో పేరు తీసేశారని.. ఇలా రకరకాల అభ్యర్థనలతో దాఖలైన పలు వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement